కువైత్‌లో జనసేన రక్తదాన శిబిరం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:03 AM
కువైత్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈసారి భిన్నంగా నిర్వహించారు. ఇరాన్ దా డుల నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశా రు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కువైత్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈసారి భిన్నంగా నిర్వహించారు. ఇరాన్ దా డుల నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశా రు. జనసైనికులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించి సేవాదృక్పథాన్ని చాటారు. కువైత్‌లోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాస జనసేన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. ప్రస్తుత యుద్ధవాతావరణంలో సభలు, సమావేశాల నిర్వహణపై ఉన్న నిషేధం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని కువైత్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కుదరవల్లి సుధాకర్ రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, కొల్లి ఆంజనేయులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం, జనసేన మధ్య ఉన్న మైత్రి బలీయమైందని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.