Share News

డ్రగ్స్‌ నియంత్రణపై కఠిన చట్టం: జనసేన

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:15 AM

డ్రగ్స్‌, సోషల్‌ మీడియా నియంత్రణపై కఠిన చట్టం చేయాలని జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి కేంద్రాన్ని కోరారు.

డ్రగ్స్‌ నియంత్రణపై కఠిన చట్టం: జనసేన

ఇంటర్నెట్ డెస్క్: డ్రగ్స్‌, సోషల్‌ మీడియా నియంత్రణపై కఠిన చట్టం చేయాలని జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి కేంద్రాన్ని కోరారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా సెస్సుల ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ అంశంపై పార్లమెంట్‌ వేదికగా పరిష్కారం చూపాలని కోరినట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ త్వరలోనే ఢిల్లీకి వచ్చి, రాష్ట్రానికి నిధుల కేటాయింపు, అమరావతికి చట్టబద్ధత అంశాలపై కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తారని తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 06:16 AM