‘జలధార’తో నీటికష్టాలకు చెక్: పవన్
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:04 AM
అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని తీరప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని తీరప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 33లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, పనుల నాణ్యతలో రాజీపడొద్దని పవన్ ఆదేశించారు.