Share News

చంద్రబాబు తీరు అన్యాయం: జైరాం రమేశ్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:27 AM

లోక్‌సభలో ప్రతిపక్షాలపట్ల ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో విమర్శించారు.

చంద్రబాబు తీరు అన్యాయం: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో ప్రతిపక్షాలపట్ల ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో విమర్శించారు. ‘2026 ఏప్రిల్‌ 16న పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత స్థానాల సంఖ్యను 50ు పెంచేలా స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీడీపీ సవరణ ప్రతిపాదన చేసింది. కానీ, అత్యంత ఆత్మవిశ్వాసం, అహంకారంతో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టీడీపీ సూచించిన ఆ సవరణను అసలు ప్రవేశపెట్టనే లేదు. మరుసటి రోజు... ఏప్రిల్‌ 17 సాయంత్రానికి ఆ కుట్రలు బహిర్గతమైయ్యాయి. స్వయం ప్రకటిత చాణక్యుడు ఎందుకు ఇలాంటి కుటిల రాజకీయ క్రీడలు ఆడారు? ఇప్పుడు అనామక నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా లోక్‌సభలో టీడీపీని సీట్ల పరంగా అధిగమించింది’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 05:28 AM