జగన్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు: తులసిరెడ్డి
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:45 AM
‘గతంలో కక్షపూరిత రాజకీయాలు చేసి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదు.
వేంపల్లె, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘గతంలో కక్షపూరిత రాజకీయాలు చేసి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే కక్షపూరిత రాజకీయాలు ఉంటాయని చెప్పడం తగదు’ అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ మాట్లాడే మాటలు సెల్ఫ్‌గోల్ కొట్టుకోవడమే. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు పోతానని చెప్పడం అవివేకం. పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తమ సమస్యలపై మాట్లాడాలని ప్రజలు బాధ్యత అప్పగిస్తే వారి అభిప్రాయాన్ని జగన్ గౌరవించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీకి పోకపోవడం మూర్ఖత్వం అని అన్నారు.