Share News

అంబటీ.. అండగా ఉంటాం

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:26 AM

ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత జగన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు.

అంబటీ.. అండగా ఉంటాం

  • రాంబాబుకు ఫోన్‌లో జగన్‌ భరోసా

  • చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి: జగన్‌

అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత జగన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుందని, తానున్నానంటూ జగన్‌ ధైర్యం చెప్పారు. అంబటిపై టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నానికి పాల్పడ్డారని, దాడులకు దిగారని ఆరోపించారు. చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు సహించబోరని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని, ప్రజలు అన్నీ చూస్తున్నారని మండిపడ్డారు. అంబటికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారని నిందించారు.

Updated Date - Feb 01 , 2026 | 05:27 AM