Share News

సిగ్గు.. సిగ్గు

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:29 AM

‘బోస్‌డికే’.. ఈ పదానికి అర్థం ఏంటో చాలామందికి తెలియదు. సాధారణంగా వాడుకలో ఉన్న పదం. చాలామంది సరదాగా కూడా అనేస్తుంటారు. దీని అర్థం ఏంటన్నది కూడా చాలామంది పట్టించుకోరు.

సిగ్గు.. సిగ్గు

  • నాడు అర్థంకాని బోస్‌డీకే అన్నందుకు విధ్వంసం

  • నేడు ఘోరమైన బూతు వాడితే సమర్థనా?

  • మందలించకపోగా.. ఫోన్‌ చేసి మరీ భరోసా

‘బోస్‌డికే’.. ఈ పదానికి అర్థం ఏంటో చాలామందికి తెలియదు. సాధారణంగా వాడుకలో ఉన్న పదం. చాలామంది సరదాగా కూడా అనేస్తుంటారు. దీని అర్థం ఏంటన్నది కూడా చాలామంది పట్టించుకోరు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను టీడీపీ నేత పట్టాభి బోస్‌డికే అన్నారని నాడు వైసీపీ శ్రేణులు రచ్చ రచ్చ చేశాయి. విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ వైసీపీ గూండాలు విధ్వంసం సృష్టించా రు. ఆ సమయంలో ఇంట్లో పట్టాభి లేకపోవడంతో బతికిపోయారు. వెంటనే పట్టాభిపై పోలీసులతో కేసులు పెట్టించి అరెస్ట్‌ చేయించి నానా రభస చేశారు. నాడు వైసీపీ నేతలు డిక్ట్షనరీల్లో బోస్‌డికే పదానికి అర్థాలు వెదికి.. ప్రెస్‌మీట్లు పె ట్టి.. జగన్‌కు ఘోర అవమానం జరిగిందని ఆరోపించారు. నాడు ఎవరికీ అర్థం కాని బోస్‌డికే పదం అన్నందుకు వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి, బూతు ఉచ్ఛరిస్తే కోపం రాదా? అయినా అంబటి రాంబాబును జగన్‌ నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారు. ఫోన్‌ చేసి భరోసా ఇస్తున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 05:30 AM