సీమ లిఫ్ట్ ఆగిపోయింది జగనే వల్లే: ఎంఎస్ రాజు
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:53 AM
రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్‌కు, ఆపార్టీ నేతలకు లేదు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం...
మడకశిర, అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్‌కు, ఆపార్టీ నేతలకు లేదు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం ముమ్మాటికీ జగనే’ అని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వెనక్కు తీసుకోవాలి. జగన్ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు ఆయన పత్రికలో బాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాశారు’ అని పేర్కొన్నారు.
చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే 2020లోనే ఆగిపోయిందని అందరికీ తెలుసని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ‘వాస్తవాలు దాచినా దాగదు. రాయలసీమ లిప్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపిందని వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆగినట్లు ఒక్క ఆధారం చూపించాలి. తెలంగాణ సీఎంతో మాకు ఉన్న రిలేషన్స్ వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు’ అని మంత్రులు స్పష్టం చేశారు.