రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్‌ది: యార్లగడ్డ
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:19 AM
దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం ముసుగులో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, ఇదే విషయాన్ని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని తెలిపారు. డూప్లికేట్ చెక్కులు, నకిలీ అకౌంట్లు, సీఎంఎఫ్ బిల్లులకు అనేక సార్లు చెల్లింపులు వంటి ఎన్నో లోపాలను కాగ్ తన నివేదికలో వెల్లడించిందన్నారు. . 2019 ఎన్నికలకు ముందు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగనివ్వబోమని, భూములిచ్చిన రైతులకు తిరిగి భూమి ఇస్తామని, అక్రమంగా సంపాదించుకోవడానికే జీఎంఆర్‌కు అంటూ విషం కక్కిన జగన్ రెడ్డి.. నేడు ఏ రకంగా క్రెడిట్ చోరీకి పాల్పడతాడని ప్రశ్నించారు.