ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకి జగన్: అచ్చెన్న
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:49 AM
‘భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఈ ఎయిర్ పోర్టు కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఈ ఎయిర్ పోర్టు కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. నాడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జగన్ రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు పనులు నిలిపేసి ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టారు. ఇప్పుడు పనులు పూర్తయ్యే దశకు రాగానే తానే చేశానని జగన్ చెప్పుకోవడం ఫేక్ రాజకీయానికి నిదర్శనం.. అని అన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ... ‘2019 మే నాటికే దాదాపు 2,500 ఎకరాల భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. అందుకు దాదాపు రూ.670 కోట్లు వెచ్చించారు. తర్వాత 2019-2024 మధ్య కాలంలో మిగిలిన భూ సేకరణ,ఆర్‌అండ్ ఆర్ పనులకుగాను రూ.249 కోట్లు వెచ్చించారు’ అని తెలిపారు.