Minister Anitha: అమరావతి పేరును ఉచ్ఛరించే అర్హత జగన్‌కు లేదు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:02 AM
మాజీ సీఎం జగన్‌కు రాజధాని అమరావతి పేరును ఉచ్ఛరించే అర్హత లేదని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఎట్రాక్షన్స్‌కు యువతులు దూరంగా ఉండాలి: మంత్రి అనిత
తాడేపల్లి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌కు రాజధాని అమరావతి పేరును ఉచ్ఛరించే అర్హత లేదని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌యూకు విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘రైతులు, మహిళలు అమరావతి రాజధాని కావాలని ఉద్యమాలు చేపడితే, న్యాయస్థానం నుంచి దేవస్థానంకు అంటూ టెంట్లు వేసుకుంటే... వారిని పోలీసులతో కొట్టించి, కేసులు పెట్టించి, టెంట్లు పీకేయించిన వ్యక్తి జగన్. ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బస్సుపై రాళ్లు రువ్వించింది కూడా జగనే. అలాంటి జగన్‌కు అమరావతి పేరును పలికే అర్హత కూడా లేదు’ అని అనిత స్పష్టం చేశారు. ఎట్రాక్షన్స్‌తో యువతులు తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్న మంత్రి... డ్రగ్స్‌కు బానిసలైతే జీవితం నాశనమేనని చెప్పారు. తొలుత కేఎల్‌యూ సెట్ ఫలితాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో కెఎల్‌ఈఎఫ్ కార్యదర్శి కోనేరు కాంచనలత, వీసీ సారథి వర్మ, డీన్ డాక్టర్ కిశోర్‌బాబు, అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.