సొంత కంపెనీల ఆదాయంపైనే జగన్ దృష్టి
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:46 AM
సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే పనిగా జగన్ రాష్ట్రాన్ని పాలించారని మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు.
వైసీపీ హయాంలో భారతి సిమెంట్స్, సాక్షికి రూ.565 కోట్ల లబ్ధి: పార్ధసారథి
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే పనిగా జగన్ రాష్ట్రాన్ని పాలించారని మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు. భారతీ సిమెంట్‌కు లబ్ధి చేకూరేలా బస్తాకు రూ.3 పెంచి సుమారు రూ.165 కోట్లు ప్రజలపై భారం మోపారని అన్నారు. సాక్షికి ప్రకటనల రూపంలో రూ.400 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మొత్తం మీద సొంత కంపెనీలకు రూ.565 కోట్ల లబ్ధిని చేకూర్చాని విమర్శించారు.