Share News

24న యూరప్‌ పర్యటనకు జగన్‌ దంపతులు

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:29 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దంపతులు ఈ నెల 24న యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్‌పై..

24న యూరప్‌ పర్యటనకు జగన్‌ దంపతులు

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దంపతులు ఈ నెల 24న యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జగన్‌ యూరప్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ దాకా అనుమతి కోరుతూ జగన్‌ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌కు ఆమోదం లభించింది. దేశం విడిచి వెళ్లే ముందు ఫోన్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ ఐడీ, ష్యూరిటీ సమర్పించాలని సీబీఐ కోర్టు షరతు విధించింది.

Updated Date - Apr 18 , 2026 | 03:29 AM