జగన్ రెడ్డి డ్రామా కంపెనీ కొత్త నాటకాలు: రాకేశ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:38 AM
గొడ్డలి పార్టీ పాలనలో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు.
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ పాలనలో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం జీవో నంబరు 117తో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే దానిని రద్దు చేసి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత లోకేశ్‌కు దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పురోగతిని చూసి సహించలేక జగన్ రెడ్డి డ్రామా కంపెనీ కొత్త నాటకాలు మొదలుపెట్టిందన్నారు.