జగన్ చేసింది రీసర్వే కాదు.. భూ కబ్జాకు స్కెచ్: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:45 AM
‘వైసీపీ ఐదేళ్ల కాలంలో చేపట్టిన భూముల రీసర్వే అనేది భూ సంస్కరణ కాదు. భూ కబ్జాల కోసం వేసిన పక్కా స్కెచ్.
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఐదేళ్ల కాలంలో చేపట్టిన భూముల రీసర్వే అనేది భూ సంస్కరణ కాదు. భూ కబ్జాల కోసం వేసిన పక్కా స్కెచ్. జగన్‌రెడ్డి సృష్టించిన భూ వివాదాల పుట్ట’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయనగరం జిల్లాలో 70 శాతం సమస్యలు రీసర్వే వల్లే పుట్టుకొచ్చాయి. అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్ట్ చేసి భూ దోపిడీకి తెరలేపారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఫొటోల కోసం రూ.కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గం. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అంశంపై జగన్ క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదం. రాబోయే రెండేళ్లలో రెవెన్యూ సమస్యలన్నింటినీ క్లియర్ చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి కొండపల్లి అన్నారు.