Share News

ఆక్వా రంగాన్ని ధ్వంసం చేసిందే జగన్‌: ఎంఏ షరీఫ్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:36 AM

అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆక్వా రంగాన్ని ధ్వంసం చేసి, రైతులను మోసం చేసిన జగన్‌, ఇప్పుడు తన వైఫల్యాలకు కుల రాజకీయాలు అనే ముసుగు వేసి మాట్లాడటం సిగ్గుచేటని..

ఆక్వా రంగాన్ని ధ్వంసం చేసిందే జగన్‌: ఎంఏ షరీఫ్‌

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆక్వా రంగాన్ని ధ్వంసం చేసి, రైతులను మోసం చేసిన జగన్‌, ఇప్పుడు తన వైఫల్యాలకు కుల రాజకీయాలు అనే ముసుగు వేసి మాట్లాడటం సిగ్గుచేటని మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమాసియా యుద్ధం వంటి కారణాల వల్ల ఫీడ్‌ ధరలు పెరుగుతున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 05:37 AM