మత్స్యకారుల కన్నీళ్లతో జగన్ రాజకీయాలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:59 AM
గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గ
మత్స్యశాఖ నిధులు మళ్లించింది ఆయనే
జగన్ హయాంలో 116 మందికి అందని పరిహారం: పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ నిధులను దారి మళ్లించి మత్స్యకారులకు అన్యాయం చేసిన జగన్, ఏం ముఖం పెట్టుకుని ఇప్పుడు పరామర్శించేందుకు వచ్చారని నిలదీశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లోనే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించాం. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 116 మందికి నష్ట పరిహారం ఇవ్వకుండా వారి కుటుంబాలు మానసికంగా కుంగిపోయేలా చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.3.15 కోట్లు చెల్లించాం’ అని పల్లా వివరించారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, పల్లా తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రా మకృష్ణబాబు మాట్లాడుతూ.... తాను అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన మత్స్యకారులకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చిన జగన్, ఇప్పుడు మాత్రం రూ.కోటి అడుగుతున్నారని మండిపడ్డారు.