Share News

‘అమరావతి’పై జగన్‌ కుట్ర: మంత్రి జనార్దన్‌రెడ్డి

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:21 AM

రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్‌ మరోమారు కుట్రలకు తెరలేపారు. రోజుకోరకంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..

‘అమరావతి’పై జగన్‌ కుట్ర: మంత్రి జనార్దన్‌రెడ్డి

బల్లికురవ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్‌ మరోమారు కుట్రలకు తెరలేపారు. రోజుకోరకంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ‘ఐదేళ్లు నిద్రపోయిన జగన్‌... ఇప్పుడు రాజధాని పనులు పరుగులు పెడుతుండటంతో ఓర్వలేకపోతున్నారు. మరో మూడేళ్లల్లో అభివృద్ధి పనులు పూర్తికావటం తథ్యం. ప్రజలకు వైపీపీ క్షమాపణ చెప్పాలి’ అని జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 10 , 2026 | 06:22 AM