చంద్రబాబు విలన్
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:47 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విలన్ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సరిగా జరగనివ్వరని, పోలీసులను పెడతారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సరిగా జరగనివ్వరు: జగన్
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విలన్ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సరిగా జరగనివ్వరని, పోలీసులను పెడతారని ఆరోపించారు. ఎన్నికలను దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని, కానీ ప్రజలు వైసీపీకి సపోర్టుగా ఉన్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గెలుపోటములు ఎలా ఉన్నా, పోలీసులను పెట్టుకున్నా, ఏరకంగా చేసినా, స్థానిక సంస్థలలో యుద్ధం జరగాల్సిందేనని పేర్కొన్నారు. ఈ చిన్న ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు గెలిచినా, వచ్చే ఏడాది తన పాదయాత్ర జరుగుతుందని, ఆ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు వస్తాయని అన్నారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబు పునాదులు కదిలేలా చేద్దామని, గట్టిగా యుద్ధం చేస్తామని అన్నారు.