ప్రజలపై జగన్ ప్రతీకార యాత్రలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:19 AM
‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ ఇలా అన్నింటిలో అవినీతికి పాల్పడ్డారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్రశేషు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ ఇలా అన్నింటిలో అవినీతికి పాల్పడ్డారు. అది సరిపోలేదని... ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం లడ్డూ కల్తీకి పాల్పడ్డారు’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూను కెమికల్స్ వాడి తయారు చేయడం క్షమించరాని నేరం. దీనిపై దేశ ప్రజలకు, వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు వైఎస్ జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. గంజాయి బ్యాచ్, దొంగలు, రౌడీలు, బూతుల నేతల కోసం పరామర్శ యాత్రల పేరిట ప్రజలపై ప్రతీకార యాత్రలు చేస్తూ జగన్ అమాయకులను బలి తీసుకుంటున్నారు’ అని శ్యామ్ విమర్శించారు.