ఆస్తి కోసం తల్లీ చెల్లిని రోడ్డున పడేసిన జగన్: పీతల సుజాత
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:13 AM
ఆస్తి కోసం తల్లినీ చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్‌దని ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత విమర్శించారు.
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం తల్లినీ చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్‌దని ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆస్తులను ప్రేమించడం, తల్లినీ చెల్లిని వేధించడం జగన్ పాలసీ అన్నారు. తల్లికీ చెల్లికి న్యాయం చేయని జగన్.. ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. అన్న ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెస్తే.. మహిళల ఆస్తిహక్కు చట్టాన్ని అవమానించేలా జగన్ వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అన్నారు.