అది అశ్లీల డాన్స్ కాదు జగన్ గారూ.!
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:05 AM
సంక్రాంతి సంబరాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ అనే వాడు అశ్లీల డాన్సులు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ ఇటీవల చేసిన విమర్శలపై జబర్దస్త్ షో నటుడు శాంతి స్వరూప్ స్పందించారు.
మా వినతితోనే మంత్రి సుభాష్ స్పెప్పులేశారు: జబర్దస్త్ శాంతిస్వరూప్
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘‘సంక్రాంతి సంబరాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ అనే వాడు అశ్లీల డాన్సులు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ ఇటీవల చేసిన విమర్శలపై జబర్దస్త్ షో నటుడు శాంతి స్వరూప్ స్పందించారు. మగాడినైనా కూడా జబర్దస్త్ షోలో, బయట ఈవెంట్లలో ఆడ వేషంలో ప్రదర్శనలు చేస్తుంటానని, విమర్శలు చేసే ముందు తెలుసుకుని చేసుంటే బావుండేదని తాను విడుదల చేసిన వీడియోలో అభిప్రాయపడ్డారు. జనవరి 15న రామచంద్రాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య మంత్రి సుభా్‌షతో తాము చేసింది అశ్లీల నృత్యం కాదన్నారు. రికార్డింగ్ డాన్స్‌లకు, తమ స్టేజ్ షో స్కిట్‌లకు తేడా తెలుసుకోవాలన్నారు. ఈవెంట్ సందర్భంగా తామే మంత్రిని రిక్వెస్ట్ చేస్తే రెండు స్టెప్పులేశారని, నిజానికి తామే వెళ్లి ఆయనతో స్టెప్పులేశామని వివరించారు. ఇక మంత్రిని మాజీ ముఖ్యమంత్రి వాడూ, వీడూ అంటూ సంభోదించడంపైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.