శ్యామలరావుకు విద్యాశాఖ అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:58 AM
ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖల అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావుకు అప్పగించింది.
అమరావతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖల అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావుకు అప్పగించింది. మిడ్ కెరీర్ ట్రైనింగ్‌లో భాగంగా ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, సీఎం సెక్రటరీ పి.ఎస్.ప్రద్యుమ్న నెల రోజుల పాటు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి జూలై 10 వరకూ వారు అక్కడ శిక్షణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో శ్యామలరావుకు కోన శశిధర్ చూస్తున్న శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎం సెక్రటరీగా ఉన్న ప్రద్యుమ్న స్థానంలో ఇన్‌చార్జి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఎక్స్‌ఆఫిషియో స్పెషల్ సీఎస్ విజయానంద్‌కు సూచించారు.