అంబటిని కాపాడింది పోలీసులే
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:05 PM
అంబటి రాంబాబును కాపాడింది పోలీసులే అన్న విషయం గుర్తు చేసుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబిరామ్ అన్నారు.
రక్షణ కల్పించలేదని మాట్లాడడం విడ్డూరం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఽ
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): అంబటి రాంబాబును కాపాడింది పోలీసులే అన్న విషయం గుర్తు చేసుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబిరామ్ అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాఉట చేశారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అమ్ముడుపోయిన కొందరు పోలీసులు దగ్గరుండి దాడులు, హత్యలు చేయించారని, ఆరోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. డీజీపీ కార్యాలయంలో కూత వేటు దూరంలో ఉండి కూడా రక్షణ కల్పించ లేదని అసత్య మాటలు మాట్లాడ్డానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. పోలీసులు అంబటిని కాపాడిన విషయాన్ని ప్రపంచం అంత చూసిందన్నారు. అంబటి ఇంటిపై దాడికి పాల్పడిన వారిలో పార్టీలకు అతీతంగా అధినేత ఉపేక్షించ కుండా చర్యలకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైఎస్ భారతి రెడ్డిపై అవాక్కులు పేలితే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారని చెప్పారు. వైసీపీ పానలలో తనపైౖ హత్యాయత్నం చేశారని అన్నారు. రఘురామకృష్ణమ రాజుపై, తనపై ఽథర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నపై తురక కిషోర్ దాడులు చేస్తే మున్సిపల్ చైర్మన్ చేశారని, జోగి రమేశ.. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. చంద్రబాబుపై అంబటి ఇష్టానుసారంగా మాట్లాడారని, పక్కదోవ పట్టించడానికే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ వ్యవహరం బయటకు రాగానే .. ప్రజాతిరుగబాటు వస్తుందని గ్రహించి వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేశగౌడ్, సత్రం రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.