Share News

మండలంగా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:56 PM

పరిపాలన సౌలభ్యం కోసం తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పెద్దహరివాణం మండల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

 మండలంగా ఏర్పాటు చేయాలి
నిరసన తెలుపుతున్న మండల సాధన జేఏసీ నాయకులు

పెద్దహరివాణం మండల సాధన నాయకులు

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ఆదోని, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పరిపాలన సౌలభ్యం కోసం తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పెద్దహరివాణం మండల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల సాధన కమిటీ సభ్యులు ఆదినారాయణరెడ్డి, మెడికల్‌ నాగరాజు, పోరప్ప గర్జప్ప మాట్లాడుతూ మండల విభజన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో మంజూరైన మండలాన్ని రద్దు చేసి ఆదోని-1, ఆదోని-2గా ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. స్థానిక నాయకుల స్వార్థం, కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు రాకూడదనే సంకుచిత ధోరణితోనే పెద్దహరివాణం మండల హోదాను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో పెద్దహరివాణం మండలం చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని వాపోయారు. పెద్దహరివాణం మండలం సాధించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని కమిటీ సభ్యులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:56 PM