Share News

సెలబ్రేషన్స్‌ హోటళ్లపై ఐటీ దాడులు

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:47 AM

విశాఖలోని సెలబ్రేషన్స్‌ గ్రూప్‌ హోటళ్లలో ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.

సెలబ్రేషన్స్‌ హోటళ్లపై ఐటీ దాడులు

  • విశాఖలోని నాలుగు బ్రాంచీల్లో సోదాలు

  • బిల్లింగ్‌లో భారీ అవకతవకలు గుర్తింపు?

విశాఖపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): విశాఖలోని సెలబ్రేషన్స్‌ గ్రూప్‌ హోటళ్లలో ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు బృందాలు ఉదయం 11.30 గంటల సమయంలో పెందుర్తి, ఎన్‌ఏడీ జంక్షన్‌, అక్కయ్యపాలెం, మధురవాడల్లోని హోటళ్లలో సోదాలు ప్రారంభించాయి. బిల్లింగ్‌, జీఎ్‌సటీ వసూళ్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పరిశీలించారు. సోదాలు జరిగే సమయంలో అడ్మిన్‌ రూమ్‌లో అకౌంట్స్‌ వ్యవహారాలు చూసే సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించలేదు. అయితే హోటల్‌లో భోజనం చేయడానికి వచ్చే కస్టమర్లకు అభ్యంతరం చెప్పలేదు. సెలబ్రేషన్స్‌ హోటళ్లలోని హార్డ్‌డి్‌స్కలను పరిశీలించగా, బిల్లింగ్‌ విషయంలో భారీగా అవకతవకలను అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కస్టమర్లకు జీఎ్‌సటీతో కూడిన కంప్యూటరైజ్డ్‌ బిల్లు అందజేసినప్పటికీ అదేరోజు రాత్రి సాఫ్ట్‌వేర్‌లో ఆయా లావాదేవీలను తొలగిస్తున్నట్టు పరిశీలనలో తేలినట్టు సమాచారం. అవకతవకలపై పూర్తిసమాచారం సేకరించిన తర్వాతే అధికారులు ఈ దాడులకు దిగినట్టు తెలిసింది. ఈ తనిఖీలు రాత్రి 10 గంటల వరకూ కొనసాగాయి.

Updated Date - Mar 09 , 2026 | 05:47 AM