Share News

మహిళలను కించపరచడం తగదు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:58 PM

మహిళలను కించపరిచే లా మాట్లాడడం ఎమ్మెల్యే విరుపాక్షికి తగదని టీడీపీ ఆలూరు ఇన్‌ చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు.

 మహిళలను కించపరచడం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న వైకుంఠం జ్యోతి

టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మహిళలను కించపరిచే లా మాట్లాడడం ఎమ్మెల్యే విరుపాక్షికి తగదని టీడీపీ ఆలూరు ఇన్‌ చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. బీసీలను దూరం పెట్టింది ఎవరో మీ పార్టీ నాయకులకు తెలుసన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను, టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న నన్ను అవమానించేలా మాట్లాడడం చూస్తే ఆయ నకు మహిళలపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. టీడీపీ జి ల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ డబ్బులు తీసుకుని పొగిడారని చేసిన ఆరోపణల్లో భోగేశ్వర ఆలయంలో ప్రమాణం చేస్తావా అని ప్ర శ్నించారు. మహిళలపై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్ప వని హెచ్చరించారు. సమావేశంలో ఏబీసీ డీసీ చైర్మన్‌ నగరడోన కిష్టప్ప, టీడీపీ నాయకులు నారాయణ, వెంకటేష్‌, నెట్టప్ప, ఆంజనే య, అంజి, కిట్టు, షేక్షా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:58 PM