వర్షం పడితే ప్రమాదమే..
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:02 AM
వర్షం వచ్చిందంటే చాలు ఆలూరు-గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కల్లివాగు వంక పొంగి పొర్లుతుంది.
ప్రతిపాదనలకే పరిమితమైన
కల్లివాగు వంతెన నిర్మాణం
టీడీపీ ప్రభుత్వంలోనైనా
నిర్మాణం జరిగేనా..?
ఆలూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వర్షం వచ్చిందంటే చాలు ఆలూరు-గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కల్లివాగు వంక పొంగి పొర్లుతుంది. వరద ఉధృతి అధికంగా ఉండడంతో మార్గంలో తెలియక వాహనాలు వెళితే ఇక ప్రాణాలు పోయినట్లే...
మంజూరు కాని నిధులు
వర్షం కురిస్తే కల్లివాగు వంక ఉప్పొంగడంతో 15 ఏళ్ల క్రితం కారు కొట్టుకుపోయి అనేక మంది మృతిచెందారు. ఆ తర్వాత ఓ సుమో కొట్టుకుపోవడంతో గ్రామస్థులు వంతెన నిర్మించాలని ఆందోళన చేయడం తో రూ.4.50 కోట్లతో వంతెన నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఏళ్లు గడిచినా నిధులు మంజూరుకాకపోవడంతో రెవెన్యూశాఖ అధికారులు ఆ వంకకు రూ.2 లక్షలు కేటాయించి తాత్కాలిక మరమ్మతులు చేయించి అక్కడ డేంజర్ బోర్డుతో పాటు వాటర్ లెవె ల్ సూచికలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి భారీగా వరదనీరు ప్రవహించడంతో 5 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కూటమి ప్రభుత్వంలోనైనా కల్లివాగు వంకపై వంతెన నిర్మాణం జరిగేనా అని ప్రజలు ఆశాభావంతో ఉన్నా రు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి నిధు లు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.