ISRO: ఎస్‌ఎస్ఎల్వీ మూడో దశ గ్రౌండ్ పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:17 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎస్ఎల్వీ)కి మూడో దశ మోటార్‌కు గ్రౌండ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌ను పరీక్షంచిన ఇస్రో
బెంగళూరు, డిసెంబరు 31: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎ్‌సఎల్వీ)కి మూడో దశ మోటార్‌కు గ్రౌండ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌లో మంగళవారం ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. ఎస్‌ఎ్‌సఎల్వీ అనేది చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఇస్రో అభివృద్ధి చేసిన రాకెట్. పూర్తి ఘన ఇంధనంతో నడిచే ఈ రాకెట్‌లో మూడు దశలు ఉంటాయి. రాకెట్ అగ్రభాగాన ఉండే మూడో దశ పేలోడ్‌ను వేగంగా అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగపడుతుంది. ఇది సెకనుకు 4 కి.మీ. వేగాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మూ డోదశకు చేసిన అప్‌గ్రేడ్లు మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ డివైజ్, అధిక పేలోడ్‌ను మోయగలిగే సామర్థ్యాలను పెంచాయని పేర్కొంది. అదనంగా మరో 90 కేజీల పేలోడ్‌ను సైతం మోసుకెళ్లే సామ ర్థ్యం పెరిగిందని తెలిపింది. 108 సెకన్లపాటు సాగిన ఈ పరీక్షలో అన్ని పారామితులు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో రాకెట్‌లోని ఎస్‌ఎస్3 మోటార్ మెరుగైన వెర్షన్ వినియోగించడానికి అర్హత సాధించిందని పేర్కొంది.