ఇస్రో మూడు కేంద్రాలకు నూతన డైరెక్టర్లు
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:54 AM
మూడు కీలకమైన ఇస్రో కేంద్రాలకు నూతన డైరెక్టర్లను నియమించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ)కు డాక్టర్ యూపీ రాజీవ్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
సూళ్లూరుపేట, జూన్ 27(ఆంధ్రజ్యోతి): మూడు కీలకమైన ఇస్రో కేంద్రాలకు నూతన డైరెక్టర్లను నియమించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ)కు డాక్టర్ యూపీ రాజీవ్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్‌సీ)కు డాక్టర్ ఎన్ జయన్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్(ఐఐఎస్‌యు)కు జోజి జే చమన్‌లను డైరెక్టర్లుగా నియమిస్తూ ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. వీరు జూలై 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక్కడ పనిచేస్తున్న డైరెక్టర్ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో నూతన డైరెక్టర్లను నియమించారు.
ఇస్రో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా జయన్
ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) డైరెక్టర్‌గా ప్రఖ్యాత ఏరోస్పేస్ ఇంజనీర్ ఎన్.జయన్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పదవిలో నియామకం కాకముందు ఆయన ఎల్‌పీఎస్‌సీ అసోసియేట్ డైరెక్టర్‌గా, క్రయోజెనిక్ స్టేజ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, నెక్ట్స్ జెనరేషన్ లాంచ్ వెహికిల్ (ఎన్‌జీఎల్‌వీ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. దేశీయ ప్రొపల్షన్ టెక్నాలజీ అభివృద్ధిలో జయన్ కీలకపాత్ర పోషించారు. దేశీయంగా సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడంతో ప్రత్యేక గుర్తింపు దక్కింది.