Share News

సాగునీటిని వెంటనే విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:51 PM

ఎల్‌ఎల్‌సీకి సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, మారయ్య డిమాండ్‌ చేశారు.

సాగునీటిని వెంటనే విడుదల చేయాలి
కాలువ వద్ద ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులు

హాలహర్వి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎల్‌సీకి సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, మారయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం బాపురం ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నప్పటికీ బోర్డు అధికారులు, అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఖరీఫ్‌ సమయం ము గిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సాగునీటి విషయంలో వెం టనే నిర్ణయం తీసుకుని రైతులను ఆదుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాఘవేంద్రరెడ్డి, రామిరెడ్డి, చెన్నప్ప ఆచారి, వీరేశప్ప, బజారప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:51 PM