ప్రతి ఎకరాకు సాగునీరు
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:59 PM
పత్తికొండ నియోజ కవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
- రెండేళ్లలో హామీలను నెరవేర్చిన ప్రభుత్వం
- నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
- పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ, జూన 16 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ నియోజ కవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సమావేశాన్ని మంగళవారం పత్తికొండ రమ్యా రిసార్ట్స్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , నియోజకవర్గ అబ్జర్వర్ సిమెంట్ పోలన్న హాజరయ్యారు. ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని అన్నారు. అక్రమ కేసులకు భయపడకుండా కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పని చేసారని అన్నారు. అలాంటి సమయంలో పార్టీ కోసం పని చేసన వారికి గుర్తింపును కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి ప్రాధా న్యం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామం నుంచి టీడీపీ అభ్యర్థులను గెలుపించుకోవాలన్నారు. అందరి సహకారంతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే అన్నారు. ఈనెల 24వ తేదీన జొన్నగిరికి రానున్న ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో రాష్ర్టాభివృద్ధికి వైసీపీ నాయకులు అడ్డు పడుతున్నారని ఆరోపిం చారు. నిష్పక్షపాతంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విషం చిమ్ముతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర, బీజేపీ, జనసేన నియోజకవర్గ ఇనచార్జీలు గోవర్ధన నాయుడు, రాజశేఖర్, జడ్పీ మాజీ చైర్మన బత్తిన వెంకట్రాముడు, వెల్దుర్తి సుబ్బారాయుడు, వెంకటపతి, రాజన్న యాదవ్, మనోహర్ చౌదరి, రామనాయుడు, పురుషోత్తమ చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు.