సాగునీటి కష్టాలను తీర్చాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:00 AM
పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కష్టాలను తీర్చాలని రైతు సంఘం, వ్యకాస నాయకులు డిమాండ్ చేశారు.
రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్
ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆదోని, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కష్టాలను తీర్చాలని రైతు సంఘం, వ్యకాస నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేదావతి ప్రా జెక్టును తక్షణమే పూర్తి చేయాలని, ఆర్‌డీఎస్ కుడి కాలువ, మేలి గనూరు వరద కాలువ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సాగునీరే ప్రాణాధారమని, వేదావతి, ఆర్‌డీఎస్ పనుల కోసం కనీసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చే శారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బ డ్జెట్‌లో ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రాబో యే రోజుల్లో ప్రజలందరినీ ఏకం చేసి పాదయాత్రలు, సబ్‌కలెక్టర్ కా ర్యాలయం ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన హె చ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్ల య్య, నాయకులు కె.లింగన్న, వెంకటేశ్వర్లు, పరమేష్, అయ్యప్ప, వీరేష్, ఈరన్న, బి.వీరారెడ్డి, దస్తగిరిబాషా, హనుమంతు పాల్గొన్నారు.