ఐఆర్‌ఆర్ కేసు మూసివేతపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:15 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులపై సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్..
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులపై సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) కేసు విచారణ మూసివేతను సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తానే ఫిర్యాదు చేశానని తెలిపారు. తన వాదనను పరిగణనలోకి తీసుకోకుండా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద సీఐడీ దాఖలుచేసిన క్లోజర్ రిపోర్ట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు యాంత్రికంగా ఆమోదించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.