ఆదోనిలో ప్రభుత్వ భూములపై విచారణ
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:49 PM
పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్న ఫిర్యాదులపై స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
ఆదోని, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్న ఫిర్యాదులపై స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులో కలిసి కబ్జాకు గురైనట్లుగా భావిస్తున్న పలు సర్వే నంబర్లను వారు స్వయం గా పరిశీలించారు. ముందుగా మండిగిరి గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 162లో గల భూములను ఎమ్మెల్యే, సబ్‌కలెక్టర్ పరిశీలిం చారు. రికార్డుల ప్రకారం ఆ భూమి విస్తీర్ణం ఎంత..? ప్రస్తుతం అక్కడ ఉన్న ఆక్రమణల పరిస్థితి ఏమిటి..? అనే అంశాలపై తహసీ ల్దార్ శేషఫణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం పేట లోని సర్వేనంబర్లు 314, 315 వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న కబ్జాలను పరిశీలించారు. ఆ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత సర్వేయర్ల ద్వారా సరిహద్దులను చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంతటివారైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదన్నారు. రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ మా ట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ కట్టడాలను లేదా ఆక్రమణలను తొలగిస్తామని తెలి పారు. వారి వెంట పట్టణ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.