డేటా చోరీపై విచారణ పూర్తి
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:55 AM
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌లో డేటా చోరీ వ్యవహారంపై విచారణ పూర్తయింది. రెండు రోజుల పాటు విచారణ చేసిన త్రిసభ్య కమిటీ..
నివేదిక ఇవ్వనున్న త్రిసభ్య కమిటీ
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌లో డేటా చోరీ వ్యవహారంపై విచారణ పూర్తయింది. రెండు రోజుల పాటు విచారణ చేసిన త్రిసభ్య కమిటీ.. ట్రస్ట్‌లో పీఎంయూ యూనిట్‌లో ఉన్న ఉద్యోగులందరినీ విచారించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రస్ట్‌లో ఉన్న వైద్యుల డేటా మొత్తం బయటికి తీయించి, దానిని ట్రస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. సదరు సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారానే వైద్యులకు, ఇతర సిబ్బందికి మేసేజ్‌లు వెళ్లినట్లు వెల్లడైంది. త్రిసభ్య కమిటీ సోమ, మంగళవారాల్లో నివేదిక సమర్పించనుండగా, దాని ఆధారంగా డేటా చోరులపై చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.