Share News

అమరావతిలో 8న మహిళా దినోత్సవం..

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:10 AM

ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఎస్‌.సవిత, గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.

అమరావతిలో 8న మహిళా దినోత్సవం..

  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఎస్‌.సవిత, గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పరేడ్స్‌ గ్రౌండ్‌లో 10వేల మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 ఎంవోయూలు చేసుకోనున్నట్లు తెలిపారు. గురువారం సచివాలయంలో సెర్ప్‌, చేనేత జౌళిశాఖ, సీఆర్‌డీఏ, గుంటూరు జిల్లా అధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. సీఎం చేతుల మీదుగా నాలుగు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం క్లస్టర్లను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 06:11 AM