హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:50 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం ఏపీ హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం హాలులో జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తులు...
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం ఏపీ హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం హాలులో జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తులు బీఎస్ భానుమతి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపలను న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మహిళ సాధికారత గురించి న్యాయమూర్తులు ప్రసంగించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సి.సుబోధ్, కార్యవర్గ సభ్యులు, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.