Share News

18, 19 తేదీల్లో విశాఖలో ఐఎఫ్ఆర్‌, మిలాన్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:47 AM

విశాఖపట్నంలో ఈ నెల 18న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎ్‌ఫఆర్‌), 19న మిలాన్‌-2026 జరగనున్నాయి.

18, 19 తేదీల్లో విశాఖలో ఐఎఫ్ఆర్‌, మిలాన్‌

  • హాజరుకానున్న రాష్ట్రపతి, రక్షణ మంత్రి, గవర్నర్‌, సీఎం తదితరులు

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 18న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎ్‌ఫఆర్‌), 19న మిలాన్‌-2026 జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం అమరావతి సచివాలయంలో సీఎస్‌ విజయానంద్‌తో విశాఖ తూర్పు నావికాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సుశీల్‌ మీనన్‌, ఇతర నౌకాదళ అధికారులు సమావేశమయ్యారు. ‘ఐఎ్‌ఫఆర్‌కు శ్రీలంక, ఇరాన్‌ తదితర 19 దేశాల నౌకలు, సుమారు 4 వేల మంది వరకూ ప్రతినిధులు హాజరవుతారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన మూడు నౌకలు 150 మంది వరకూ ప్రతినిధులు పాల్గొంటున్నారు. మన దేశానికి సంబంధించి 90 నౌకలు, 45 విమానాలు, సుమారు 600 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 18న విశాఖ సముద్రతీరంలో ఐఎ్‌ఫఆర్‌, 19న సిటీ పరేడ్‌ ఉంటాయి. ఫ్లీట్‌ రివ్యూకు రాష్ట్రపతి, రక్షణ మంత్రి, రాష్ట్ర గవర్నర్‌, సీఎం హాజరవుతారు’ అని వివరించారు.

Updated Date - Feb 03 , 2026 | 03:48 AM