Share News

International Experts: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల సంతృప్తి

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:33 AM

పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులపై అంతర్జాతీయ నిపుణుల త్రయం సీన్‌ హిచ్‌బర్గర్‌ (కెనడా), డేవిడ్‌ బి.పాల్‌ (అమెరికా), గియాన్‌ ఫ్రాంకో డి కాకో సంతృప్తి వ్యక్తం చేశారు.

International Experts: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల సంతృప్తి

అమరావతి/పోలవరం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులపై అంతర్జాతీయ నిపుణుల త్రయం సీన్‌ హిచ్‌బర్గర్‌ (కెనడా), డేవిడ్‌ బి.పాల్‌ (అమెరికా), గియాన్‌ ఫ్రాంకో డి కాకో సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం వారు రాజమహేంద్రవరం చేరుకున్న వెంటనే.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి ఈఎన్‌సీ నరసింహమూర్తితో కలసి వెళ్లారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రాంతంలో పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ పనులపైనా, డిజైన్లపైనా సమీక్షించారు. ఈ సమీక్షలో పోలవరం పనుల నాణ్యత, కాంక్రీట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సమగ్ర పరిశీలన చేస్తామని నిపుణుల త్రయం పేర్కొంది. పనులకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలని అధికారులకు సూచించింది.

Updated Date - Jan 20 , 2026 | 04:34 AM