Share News

Board Secretary Ranjith Basha: ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరగాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:07 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్‌ బాషా అధికారులను...

Board Secretary Ranjith Basha: ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరగాలి

  • జూనియర్‌ కళాశాలలపై ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సమావేశం

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లి కార్యాలయంలో ఆర్జేడీలు, ఆర్‌ఐవోలు, డీఐఈవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. 2025 పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న జిల్లాల అధికారులు తరచూ ప్రభుత్వ కళాశాలలను సందర్శించి సంకల్ప్‌-2026 అమలును పరిశీలించాలన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు అనేక మార్పులతో జరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు 45 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, వాటిని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని రంజిత్‌ బాషా తెలిపారు.

Updated Date - Jan 06 , 2026 | 05:07 AM