ఇంటర్ హాల్ టికెట్ల విడుదల
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:27 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా గురువారం తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి విద్యార్థులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా హాల్ టికెట్లన్నీ డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. ఫీజుల బకాయిల పేరుతో ఏ కాలేజీ యాజమాన్యం హాల్‌టికెట్లను ఆపకూడదని స్పష్టంచేశారు.