SC Corporation Loans: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ!
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:15 AM
రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ యువత తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
11,479 మంది ఎస్సీ యువతకు ప్రయోజనం
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ యువత తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన మొత్తం రూ.193.40 కోట్ల రుణంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీల ద్వారా రూ.66.04 కోట్లు రుణాలందించారు. కొవిడ్ కారణంగా లబ్ధిదారులు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ భారంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11,479 మంది ఎస్సీ లబ్ధిదారులు తీసుకున్న ఈ రుణాలపై ఆగస్టు 31, 2025 వరకు వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెల్లించాల్సిన అసలును నాలుగు నెలల్లోపు చెల్లిస్తే ఈ వడ్డీ మాఫీ అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.