23 నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:24 AM
ఇంటర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అఽధికారి ఎస్.సరళాదేవి తెలిపారు. మచిలీపట్నంలోని లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
-మార్చి 24న వరకు నిర్వహణకు ఏర్పాట్లు
- జిల్లాలో 63 పరీక్షా కేంద్రాలు సిద్ధం
- పరీక్షలకు హాజరుకానున్న 49, 579 మంది విదార్థులు
- ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అఽధికారి ఎస్.సరళాదేవి
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 18 (ఆధ్రజ్యోతి):
ఇంటర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అఽధికారి ఎస్.సరళాదేవి తెలిపారు. మచిలీపట్నంలోని లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ జిల్లాలో 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో 24,173 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 25,406 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 14 మంది కస్టోడియన్లు, 63 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 63 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లు, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఏవిధమైన జిరాక్స్ సెంటర్లు తెరచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పి.ఎస్.జి.ఎన్ .లక్ష్మి, డి.సత్యనారాయణ, సందీప్, పి.నాగరవి తదితరులు పాల్గొన్నారు.