20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:57 AM
సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ.. ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఘటన
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్‌కేడీ కాలనీలో ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఈ విషయమై బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పరీక్ష కేంద్రం ఎగ్జామినేషన్ చీఫ్, ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంటల్ అధికారులను, సిబ్బందిని నిలదీశారు. కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రామ్‌నాథ్ అక్కడ చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో లాలప్పను వివరణ కోరగా.. తల్లిదండ్రుల ఫిర్యాదులు అందాయని, సీసీటీవీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.