రోస్టర్ పాయింట్లు ప్రదర్శించండి
ABN , Publish Date - May 20 , 2026 | 05:35 AM
బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్లుగా పదోన్నతులు కల్పిస్తున్న నేపథ్యంలో రోస్టర్ పాయింట్లు ప్రదర్శించాలని ఇంటర్ విద్య, ఉద్యోగుల..
ఇంటర్ విద్య, ఉద్యోగుల అసోసియేషన్
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్లుగా పదోన్నతులు కల్పిస్తున్న నేపథ్యంలో రోస్టర్ పాయింట్లు ప్రదర్శించాలని ఇంటర్ విద్య, ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. పదేళ్లుగా లైబ్రేరియన్లకు పదోన్నతులు ఇవ్వనందున గతంలో రోస్టర్ ఏ పాయింట్ వద్ద ఆగిందనే వివరాలు సబ్జెక్టుల వారీగా ఆర్జేడీ కార్యాలయాల్లో వెల్లడించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. శ్రీనివాసులు, సీహెచ్ సుధాకర్... ఇంటర్ బోర్డు కమిషనర్ రంజిత్‌బాషాకు వినతిపత్రం ఇచ్చారు.