ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై అత్యాచారం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:34 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడు మాయ మాటలుచెప్పి... దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
తిరుపతి(నేరవిభాగం), జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడు మాయ మాటలుచెప్పి... దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం మేరకు...కడప జిల్లా బద్వేలుకు చెందిన వీర యశ్వంత్ (21) చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. తిరుపతి రూరల్ మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 21న తిరుపతికి వచ్చిన యశ్వంత్ హోటల్లో దిగి యువతిని ఆహ్వానించాడు.ఆమె రాగా మద్యం సేవించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి హోటల్ గదిలో ఆధారాలు సేకరించారు. అలాగే యువతికి రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.