Share News

గొరిల్లా వేషంలో పంచాయతీ సిబ్బంది

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:12 AM

కోతుల బెడద నివారణకు కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి పంచాయతీ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో మూడేళ్లుగా కోతులు పంటలను నాశనం చేస్తూ...

గొరిల్లా వేషంలో పంచాయతీ సిబ్బంది

  • కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయోగం

కూచిపూడి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): కోతుల బెడద నివారణకు కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి పంచాయతీ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో మూడేళ్లుగా కోతులు పంటలను నాశనం చేస్తూ, మనుషులను గాయపరుస్తూ, ఆస్తినష్టం కలిగిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పంచాయతీ కార్యదర్శి వీరాంజనేయులు ఆధ్వర్యంలో సిబ్బంది ఒకరికి ఆదివారం గొరిల్లా వేషం వేయించి గ్రామంలో తిప్పారు. కొండముచ్చును కూడా తెప్పించి కోతులు ఉన్న ప్రాంతంలో తిప్పడంతో అవి పొలాల నుంచి పరుగులు తీశాయి. ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వడంతో కోతుల బెడద తగ్గే వరకు ఇదే విధానాన్ని కొన సాగించాలని భావిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 06:13 AM