పోలింగ్ రోజైనా ఓటర్లను కలవాలని
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:16 AM
ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లోని 9వ డివిజన్ టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాచర్ల వెంకట రమణయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లోని 9వ డివిజన్ టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాచర్ల వెంకట రమణయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కొద్దిరోజులుగా మంచంమీదే ఉన్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులే ఎన్నికల ప్రచారంలో చేశారు. ఆదివారం పోలింగ్ నాడైనా ఓటర్లకు కనిపించాలన్న ఉద్దేశంతో గోపాల్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం ద్దకు వచ్చారు. నడపలేని స్థితిలో ఉన్న ఆయనను అనుచరులు చేతులపై ఎత్తుకురాగా, ఆతర్వాత చక్రాల కుర్చీలో వచ్చి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా పలువురు రమణయ్యను పరామర్శించారు.