విశాఖలో ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:06 AM
విశాఖలో ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద 20 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు 99 పైసల చొప్పున ఆ భూములు కేటాయిస్తారు.
ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద కేటాయింపు
750 కోట్ల పెట్టుబడి పెట్టనున్న టెక్ దిగ్గజం
7,000 మందికి ఉద్యోగ అవకాశాలు
అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): విశాఖలో ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద 20 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు 99 పైసల చొప్పున ఆ భూములు కేటాయిస్తారు. రూ. 750 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా భూకేటాయింపులు చేయాలని చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2024-29 జీసీసీ పాలసీ మేరకు ప్రపంచ స్థాయి సంస్థలకు భూ ప్రోత్సాహకాలను ఇస్తామని స్పష్టం చేసింది. 2024 డిసెంబరు 12న మార్గదర్శకాలను రూపొందించింది. వాటి మేరకు పలు ఐటీ దిగ్గజ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి చొప్పున కేటాయిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసి్‌సకు విశాఖపట్నం యండాడలో ఎకరా 99 పైసల చొప్పున 20 ఎకరాలను కేటాయిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలసీ మేరకు 7 వేల ఉద్యోగాలు కల్పిస్తున్న ఇన్ఫోసిస్‌కు పాలసీ మేరకు భూమి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని సంబంధించి కార్యాచరణ చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీని, రెవెన్యూ శాఖను ఐటీ శాఖ కోరింది.